సమూయేలు మొదటి గ్రంథము 27 : 1 (TEV)
తరువాత దావీదునేను ఇక్కడ నిలుచుట మంచిది కాదు, ఏదో ఒక దినమున నేను సౌలుచేత నాశన మగుదును; నేను ఫిలిష్తీయుల దేశములోనికి తప్పించుకొని పోవుదును, అప్పుడు సౌలు ఇశ్రాయేలీయుల సరి హద్దులలో నన్ను వెదకుట మానుకొనును గనుక నేను అతని చేతిలోనుండి తప్పించుకొందునని అనుకొని
సమూయేలు మొదటి గ్రంథము 27 : 2 (TEV)
లేచి తనయొద్దనున్న ఆరువందలమందితో కూడ ప్రయాణమై మాయోకు కుమారుడును గాతు రాజునైన ఆకీషునొద్దకు వచ్చెను.
సమూయేలు మొదటి గ్రంథము 27 : 3 (TEV)
దావీదు గాతులో ఆకీషునొద్ద చేరగా అతడును అతని వారందరును తమ తమ కుటుంబముల సమేతముగా కాపురముండిరి. యెజ్రెయేలీయురాలగు అహీనోయము, నాబాలు భార్యయైయుండిన కర్మెలీయు రాలగు అబీగయీలు అను అతని యిద్దరు భార్యలు దావీదుతోకూడ ఉండిరి.
సమూయేలు మొదటి గ్రంథము 27 : 4 (TEV)
దావీదు గాతునకు పారిపోయిన సంగతి సౌలునకు తెలిసిన మీదట అతడు దావీదును వెదకుట మాని వేసెను.
సమూయేలు మొదటి గ్రంథము 27 : 5 (TEV)
అంతట దావీదురాజపురమందు నీయొద్ద నీ దాసుడనైన నేను కాపురము చేయనేల? నీ దృష్టికి నేను అనుగ్రహము పొందినవాడనైతే బయటి పట్టణములలో ఒకదానియందు నేను కాపురముండుటకు ఒక స్థలము ఇప్పించుమని ఆకీషును అడుగగా
సమూయేలు మొదటి గ్రంథము 27 : 6 (TEV)
ఆకీషు సిక్లగు అను గ్రామమును ఆ దినమున అతని కిచ్చెను. కాబట్టి నేటివరకు సిక్లగు యూదారాజుల వశమున నున్నది.
సమూయేలు మొదటి గ్రంథము 27 : 7 (TEV)
దావీదు ఫిలిష్తీయుల దేశములో కాపురముండిన కాల మంత ఒక సంవత్సరము నాలుగు నెలలు.
సమూయేలు మొదటి గ్రంథము 27 : 8 (TEV)
అంతలో దావీదును అతని వారును బయలుదేరి గెషూరీయుల మీదను గెజెరీయులమీదను అమాలేకీయులమీదను పడిరి ప్రయాణస్థులు పోవుమార్గమున షూరునుండి ఐగుప్తువరకు నున్న దేశములో వారు పూర్వము కాపురముండగా
సమూయేలు మొదటి గ్రంథము 27 : 9 (TEV)
దావీదు ఆ దేశస్థులను హతముచేసి, మగవానినేమి ఆడు దానినేమి యెవరిని సజీవులుగా విడువక గొఱ్ఱలను ఎడ్లను గార్దభములను ఒంటెలను వస్త్రములను దోచుకొని తిరిగి ఆకీషునొద్దకు వచ్చెను.
సమూయేలు మొదటి గ్రంథము 27 : 10 (TEV)
ఆకీషుఇప్పుడు మీరు దండెత్తి దేశములో జొరబడితిరా అని దావీదు నడుగగా దావీదుయూదా దేశమునకును యెరహ్మెయేలీయుల దేశమున కును కేనీయుల దేశమునకును దక్షిణముగా మేము ఒక ప్రదేశములో జొరబడితిమనెను.
సమూయేలు మొదటి గ్రంథము 27 : 11 (TEV)
ఆలాగున దావీదు చేయుచు వచ్చెను. అతడు ఫిలిష్తీయుల దేశములో నివ సించినంత కాలము ఈ ప్రకారముగా చేయునని తమ్మును గురించి వారు చెప్పుదురేమో అని గాతుకు వర్తమానము తేగల మగవానినైనను ఆడు దానినైనను దావీదు బ్రతుక నియ్యలేదు.
సమూయేలు మొదటి గ్రంథము 27 : 12 (TEV)
దావీదు తన జనులైన ఇశ్రాయేలీయులు తనయందు బొత్తిగా అసహ్యపడునట్లు చేసెను గనుక అతడు సదాకాలము నాకు దాసుడుగాను ఉండునని అనుకొని ఆకీషు దావీదు మాట నమ్మెను.
❮
❯